: గుంటూరు జిల్లాలో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన
గుంటూరు జిల్లా లాంఫాంలో వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఈరోజు కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ శంకుస్థాపన చేశారు. అనంతరం పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి, ఏపీ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ పరిశోధనలలో ఖ్యాతిగాంచిన లాం ఫాంలో ఈ వర్సిటీ రూపుదాల్చనుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరు చేసింది. సుమారు 910 ఎకరాలను అధికారులు సిద్ధం చేశారు. రాష్ట్ర విభజనతో నవ్యాంధ్రలో ఈ వర్సిటి ఏర్పాటు అనివార్యమైంది. ఆచార్య ఎన్జీ రంగా పేరుతో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.