: వివిధ నగరాల్లో పెరిగిన 'పెట్రో' ధరలు ఇవే!
ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరల సరళి, డాలర్ తో రూపాయి మారకపు విలువను అనుసరించి, లీటరు పెట్రోలుపై 36 పైసలు, డీజిల్ పై 87 పైసల మేరకు ధరలను పెంచిన సంగతి తెలిసిందే. పెంచిన తరువాత ఢిల్లీలో పెట్రోలు ధర రూ. 60.70 నుంచి రూ. 61.06కు పెరుగగా, డీజిల్ ధర రూ. 45.93 నుంచి రూ. 46.80కి చేరింది. ఇక పెట్రోలు ధర ముంబైలో రూ. 68.13, కోల్ కతాలో రూ. 66.39, చెన్నైలో రూ. 61.38గా, హైదరాబాద్ లో రూ. 66.12కు పెరుగగా, డీజిల్ ధర కోల్ కతాలో రూ. 50.29, ముంబైలో రూ. 54.04, చెన్నైలో రూ. 48, హైదరాబాద్ లో రూ. 50.93కు పెరిగింది. వివిధ నగరాలు, పట్టణాలకు సమీపంలోని చమురు రిఫైనరీ కేంద్రాల నుంచి ఉన్న దూరం, వివిధ రాష్ట్రాల పన్నుల వ్యత్యాసం కారణంగా ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. కాగా, ఇంటర్నేషనల్ క్రూడాయిల్ మార్కెట్లో భారత బాస్కెట్ క్రితం ముగింపు బ్యారల్ కు 42.41 డాలర్లుగా కొనసాగింది.