: ఎన్నికల ప్రచారానికి వరంగల్ బయల్దేరిన జగన్
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి వరంగల్ బయల్దేరారు. లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన హైదరాబాద్ నుంచి బయల్దేరి వెళ్లారు. లోక్ సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం నాలుగు రోజుల పాటు ఆయన విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సాయంత్రం తొర్రూరులో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. వైకాపా తరపున నల్లా సూర్యప్రకాశ్ ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. జగన్ పర్యటన నేపథ్యంలో జిల్లాలోని వైకాపా శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మరోవైపు తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అన్ని పార్టీల నేతలు ప్రచారంలో తమ సర్వశక్తులను ఒడ్డుతున్నారు.