: భారీ వర్షాల కారణంగా చెన్నై-విజయవాడ మధ్య రైళ్ల రద్దు


చెన్నై-విజయవాడ మధ్య రైళ్లు రద్దయ్యాయి. తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల రైల్వే ట్రాక్ పైకి నీళ్లు రావడంతో అన్ని రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నై సహా అనేక జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్ష బీభత్సం దృష్ట్యా 16 జిల్లాల్లో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

  • Loading...

More Telugu News