: యాదగిరీశుడిని దర్శించుకున్న తెలంగాణ డీజీపీ


తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ నిర్వాహకులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం డీజీపీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి తాత్కాలిక డీజీపీగా కొనసాగుతున్న శర్మ రెండు రోజుల కిందటే పూర్తిస్థాయి డీజీపీగా నియమితులయ్యారు. ఆ వెంటనే బాధ్యతలు చేపట్టారు.

  • Loading...

More Telugu News