: చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం... పాఠశాలలకు సెలవు, ఘాట్ రోడ్ల మూసివేత


మొన్నటిదాకా తమిళనాడులోని పలు ప్రాంతాలను ముంచెత్తిన వర్షాలు తాజాగా చిత్తూరు జిల్లాను చుట్టుముట్టాయి. జిల్లావ్యాప్తంగా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో జిల్లావ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. జిల్లా పరిధిలోని వాగులన్నీ పొంగి పొరలుతున్నాయి. జలాశయాలన్నీ నిండిపోయాయి. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ప్రభుత్వం జిల్లాలోని విద్యాలయాలకు నేడు సెలవు దినంగా ప్రకటించింది. ఇక నాలుగు రోజుల క్రితం స్వల్పకాలం పాటు మూతపడ్డ తిరుమల ఘాట్ రోడ్లు రెండింటినీ టీటీడీ అధికారులు మళ్లీ మూసేశారు. విరిగిపడ్డ కొండచరియలను తొలిగించే ప్రక్రియకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో రెండు ఘాట్ రోడ్లను మూసేసిన అధికారులు లింక్ రోడ్డు ద్వారా వాహనాలను పంపిస్తున్నారు. ఇక తిరుమలలోని గోగర్భం, పాపవినాశనం జలాశయాలు పూర్తిగా నిండాయి. వర్షం కారణంగా మరింత మేర నీటి చేరిక కారణంగా రెండు జలాశయాల గేట్లను అధికారులు ఎత్తివేశారు.

  • Loading...

More Telugu News