: రెండో అంతస్తు కిటికీ అంచులకు వేలాడి ప్రాణాలు కాపాడుకున్న గర్భవతి!
పారిస్ లో శుక్రవారం రాత్రి వేర్వేరు చోట్ల జరిగిన ‘ఉగ్ర’ దాడుల్లో 128 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్న విషయం తెలిసిందే. ఉగ్రవాదుల తూటాలకు కొంతమంది బలై పోగా, చాలామంది తమ ప్రాణాలను కాపాడుకునే క్రమంలో పరుగులు తీశారు. ఈ క్రమంలో... ఒక గర్భవతి తన ప్రాణాలను కాపాడుకునేందుకు బాటాక్లాన్ థియేటర్ వద్ద రెండో అంతస్తు కిటికీ అంచులకు వేలాడింది. తనను రక్షించమంటూ ఆమె రోదించింది. సాయం చేయమంటూ గొంతు చించుకుని అరిచింది. ఆమె ఆర్తనాదాలను విన్న ఒక సాహసి అక్కడికి వచ్చి ఆమెను పైకి లాగాడు. ఈ సంఘటనకు సంబంధించిన ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ వీడియోను తీసింది డానియెల్ సెన్నీ అనే ఒక జర్నలిస్టు. బాటాక్లాన్ థియేటర్ కు ఎదురుగా ఉన్న ఒక భవనంలో ఉంటున్న డానియెల్ ఈ వీడియో తీశారు. అయితే, వీడియో చిత్రీకరణ సమయంలో జర్నలిస్టు డానియెల్ భుజానికి బుల్లెట్ గాయమైంది.