: టీఆర్ఎస్ ఓడితే నేను రాజీనామాకు సిద్ధం... కాంగ్రెస్ ఓడితే ఉత్తమ్ చేస్తారా?: మంత్రి కేటీఆర్


వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికలో టీఆర్ ఎస్ అభ్యర్థి ఓడిపొతే తాను రాజీనామా చేస్తానని, మరి, కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైతే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఆయన ఆదివారం ఒక మీడియా ఛానల్ తో మాట్లాడారు. ఉప ఎన్నికల సమయంలో నిరసనలు, నిలదీతలు అంతా కేవలం మీడియా సృష్టే అని అన్నారు. తెలంగాణ కేబినెట్ లో మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా ఉండే పార్టీలకు ప్రజలు ప్రాధాన్యమిస్తున్నారన్నారు. ఇందుకు ఢిల్లీ, బీహార్ ఎన్నికలే నిదర్శనమన్నారు. ‘నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయి 19 నెలలవుతోంది. తెలంగాణకు ఆయన ముఖం చూపించలేదు. తెలంగాణకు ముఖం చూపెట్టని ప్రధాన మంత్రి పార్టీ ఏ ముఖం పెట్టుకుని వరంగల్ ఉపఎన్నికలో ఓట్లు అడుగుతుంది? బీజేపీకి ఓట్లు అడిగే నైతిక హక్కు కూడా లేదు. హైకోర్టు విభజన, ఉద్యోగుల విభజనపై ఈ రోజు వరకూ కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తోంది. తెలంగాణకు బీజేపీ చేసింది అల్లికి అల్లి, సున్నకు సున్న’ అంటూ కేసీఆర్ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News