: నా టైం బాగుండలేదు... అందుకే ఇలా జరిగింది: ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి
‘నా టైం బాగుండలేదు. అందుకే ఇలా జరిగింది’ అన్నాడు ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి. పోలీసులు ఆయన్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు. గంగిరెడ్డి కేసు వివరాలు, ఆస్తుల జాబితా మొదలైన వివరాలను ఏపీ డీజీపీ రాముడు తెలిపారు. అనంతరం గంగిరెడ్డితో మీడియా మాట్లాడింది. ఈ సందర్భంలోనే గంగిరెడ్డి పైవిధంగా వ్యాఖ్యానించాడు. ‘నాకు తెలిసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెబుతాను. తెలియని వాటికి నేను సమాధానం చెప్పలేను’ అని గంగిరెడ్డి అన్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మీ ప్రాణానికి ప్రమాదముందా? అన్న ప్రశ్నకు ‘ అలాంటిదేమి లేదు. ఏ ప్రభుత్వమైనా ప్రజల కోసమే పని చేస్తుంది’ అని ఆయన సమాధానమిచ్చాడు. ‘మారిషస్ కు మీరు ఎందుకు పారిపోయారు?’ అనే ప్రశ్నకు గంగిరెడ్డి స్పందిస్తూ...‘నేనేమి పారిపోలేదు. వ్యాపారం నిమిత్తం అక్కడికి వెళ్లాను. మినరల్ బిజినెస్ చేయాలనుకున్నాను. దానికి సంబంధించిన కంపెనీ మారిషన్ లో ఉంది. అందుకే అక్కడికి వెళ్లాను’ అని చెప్పాడు.