: ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు అవసరం: జీ-20 సదస్సులో ప్రధాని మోదీ
ఉగ్రవాదంపై అంతర్జాతీయ స్థాయి ఉమ్మడి పోరు తక్షణావసరమని భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. టర్కీలోని అంటల్యాలో జరుగుతున్న జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ‘ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు మానవాళి ఒక్కటై నిలబడాలి. బ్రిక్స్ కూటమికి భారత్ అధిక ప్రాధాన్యమిస్తుంది. ప్రతి స్పందక, సమ్మిళిత, సమష్టి పరిష్కారాలే లక్ష్యంగా పని చేస్తాం. ఉగ్రవాదంపై పోరు బ్రిక్స్ దేశాలకూ ప్రధానాంశం కావాలి. పారిస్, అంకారా, బీరుట్ లో జరిగిన ఉగ్ర దాడులను ఖండిస్తున్నాను’ అన్నారు.