: అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్ విడిది చేసిన హోటల్ వద్ద అభిమానుల సందడి!


గోదావరి తీరం, పచ్చని పొలాల మధ్య ఓ చిత్రం షూటింగ్ లో పాల్గొనే నిమిత్తం హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లు రాజమండ్రి వచ్చారు. వీరు వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న అభిమానులు రాజమండ్రి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. వీరిద్దరూ నగరంలోని షెల్టాన్ హోటల్ లో బసచేశారు. దీంతో హోటల్ వద్ద కూడా అభిమానుల సందడి నెలకొంది. వీరిద్దరూ గోదావరి పరీవాహక ప్రాంతంలో మూడు రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి 'సరైనోడు' అనే టైటిల్ పెడుతున్నారు.

  • Loading...

More Telugu News