: మీ బడ్జెట్ ఎంతైనా సరే ఓ స్మార్ట్ ఫోన్ కొనేయొచ్చు!
ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ తప్పనిసరైన నేపథ్యంలో రూ. 50 వేలకు పైగా పెట్టి యాపిల్ ఐఫోన్ 6 సిరీస్ నుంచి రూ. 5 వేలకు లోపుగా కూడా స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అంతకన్నా తక్కువకు కూడా... అంటే 3 వేలకు లోపుగా కూడా ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ ఎంత పెట్టదలిస్తే, అంతలో ఓ ఫోన్ పట్టేయొచ్చు. ఈ నేపథ్యంలో ఇటీవల మార్కెట్లోకి వచ్చిన కొన్ని స్మార్ట్ ఫోన్ల వివరాలివి. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 5: దీని ధర రూ. 11,999. 3జీబీ రామ్, హెచ్డీ డిస్ ప్లే, 5.2 అంగుళాల గొరిల్లా గ్లాస్ స్క్రీన్, 1.3 జిహెచ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 16 జీబీ స్టోరేజ్, 13/5 ఎంపి కెమెరాలు, 2,900 ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం. వన్ ప్లస్ 2: దీని ధర రూ. 24,999. ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్బీ 'సీ' టైప్ కనెక్టర్, 64 జీబీ స్టోరేజ్, ఆటో ఫోకస్ కెమెరా, 5.5 అంగుళాల స్క్రీన్, 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ, 1.8 జీహెచ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ లతో లభించే ఇది ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మార్కెట్లో హాట్ టాపిక్. వన్ ప్లస్ ఎక్స్: వన్ ప్లస్ నుంచి వచ్చిన మరో ఫోన్ ఇది. ఈ ఫోన్ అందిస్తున్న ఫీచర్లతో ఉన్న ఇతర కంపెనీల ఫోన్ల ధరతో పోలిస్తే రూ. 5 వేల వరకూ తక్కువకు రూ. 16,999కి లభిస్తోంది. 5 అంగుళాల గొరిల్లా గ్లాస్, 2.3 జీహెచ్ స్నాప్ డ్రాగన్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 3 జిబీ రామ్, 13/8 ఎంపీ కెమెరాలు, 2525 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకతలు. క్సోలో ఏరా హెచ్డీ: దీని ధర రూ. 4,777 మాత్రమే. 5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ ప్లే, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 8 జీబీ ఇంటర్నల్ మెమొరీ, వినూత్న ట్రూవ్యూ టెక్నాలజీ, 8/5 ఎంపీ కెమెరాలు, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ ఆన్ లైన్ అమ్మకాలు 16 నుంచి ప్రారంభం కానున్నాయి. మొట్టమొదటి సారిగా స్మార్ట్ ఫోన్ వాడాలని భావించేవారికి ఇది చక్కగా నప్పుతుంది. జియోమీ ఎంఐ-4: రూ. 17,999 రూపాయల ధరలో మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ లో టీవీలు, ఏసీలు, డీవీడీ ప్లేయర్ తదితరాలను నియంత్రించే రిమోట్ కంట్రోల్ అదనపు ఆకర్షణ. 5 అంగుళాల స్క్రీన్, 2.5 జీహెచ్ స్నాప్ డ్రాగన్ 801 క్వాడ్ కోర్ ప్రాసెసర్, 64జీబీ స్టోరేజ్ 13/8 ఎంపీ కెమెరాలు, 3,080 ఎంఏహచ్ బ్యాటరీలు ఉన్నాయి. కార్బన్ టైటానియం ఎస్21: దీని ధర రూ. 2,999 మాత్రమే. 3.2/1.3 ఎంపీ కెమెరాలు, 4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్క్రీన్, ఆండ్రాయిడ్ 4.4.3 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్512 ఎంబీ రామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 136 గంటల స్టాండ్ బై టైం ఇచ్చేలా 1600 ఎంఎహచ్ బ్యాటరీ ఉన్నాయి.