: సొంత పార్టీ ఎమ్మెల్యేపై చేయి చేసుకున్న నటుడు విజయకాంత్!
తన ప్రసంగానికి అడ్డు తగిలాడన్న ఆగ్రహంతో సొంత పార్టీ ఎమ్మెల్యేపై సినీ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ చెయ్యి చేసుకోవడం ఆయనపై కొత్త విమర్శలకు దారితీసింది. కడలూరు జిల్లాలో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రజలను పరామర్శించేందుకు వెళ్లిన విజయకాంత్ బన్రూట్టి గ్రామంలో ప్రసంగిస్తున్న వేళ, కొందరు స్థానిక నేతల పేర్లను తప్పుగా పలికారు. పక్కనే ఉండి దీన్ని గమనించిన ఎమ్మెల్యే శివకుళందై, పేర్లను సరి చేసేందుకు ప్రయత్నించగా, విజయకాంత్ సహనం కోల్పోయారు. ఎమ్మెల్యే వీపుపై, ఆపై తలపై కొట్టారు. గతంలోనూ తన పార్టీ ఎమ్మెల్యేలపై ఆయన చేయి చేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.