: లో దుస్తుల్లో బ్లూటూత్ తో హైటెక్ కాపీయింగ్... పట్టుబడ్డ హైదరాబాదీ


మరో హైటెక్ కాపీయింగ్ గుట్టు రట్టయింది. 'జెన్ కో'లో ఖాళీల భర్తీకి నిర్వహిస్తున్న పరీక్షల్లో అత్యాధునిక సాంకేతిక పరికరాల సాయంతో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరీక్షలకు అంబర్ పేటకు చెందిన జీ అంజిబాబు అనే యువకుడు లో- దుస్తుల్లో బ్లూటూత్ పెట్టుకుని వచ్చాడు. ఆపై దాని సాయంతో ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటుండగా, అతని ప్రవర్తనపై అనుమానంతో ఇన్విజిలేటర్ తనిఖీ చేయగా విషయం బయటపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు అంజిబాబును అదుపులోకి తీసుకుని దీని వెనకున్న ఇతర సూత్రధారులను పట్టుకునే పనిలో పడ్డారు.

  • Loading...

More Telugu News