: పవన్ కల్యాణ్ కి అవగాహన లేదు: ఎమ్మెల్యే రాజన్న దొర
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బాక్సైట్ తవ్వకాలపై అవగాహన లేదని సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ, బాక్సైట్ తవ్వకాలకు వైఎస్సార్సీపీ వ్యతిరేకమని తెలిపారు. బాక్సైట్ తవ్వకాలపై చర్చించేందుకు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు సమావేశం కానున్నామని ఆయన చెప్పారు. పవన్ కల్యాణ్ కు అవగాహన లేకే గత ప్రభుత్వం హయాంలోనే బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. బాక్సైట్ తవ్వకాలకు ఉత్తరాంధ్రులెవ్వరూ సుముఖంగా లేరని ఆయన స్పష్టం చేశారు. కాగా, బాక్సైట్ తవ్వకాలను గిరిజనులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.