: మొబైల్ ఫోన్ ను వాడకండి: ములాయం సింగ్
అవసరమైతే తప్ప మొబైల్ ఫోన్ వాడకండని సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తన పార్టీ నేతలకు, ప్రజలకు సూచించారు. వ్యక్తిగతంగా తాను మొబైల్ ఫోన్ వాడనని... ఇతర ప్రత్యామ్నాయం లేనప్పుడే వాడతానని చెప్పారు. పెరిగిపోతున్న టెక్నాలజీ మనకు ఇబ్బందులను కూడా తీసుకొస్తోందని... మొబైల్ ఫోన్ లో మాట్లాడిన మాటలను ట్యాప్ చేసి, ఆ తర్వాత బెదిరింపులకు దిగే అవకాశం ఉందని అన్నారు. లక్నోలో ఈ రోజు జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.