: ఏపీ రాజధానికి కృష్ణా జిల్లా వాసి స్థిరాస్తుల విరాళం


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన నందమూరి శివకుమార్ భారీ విరాళం ఇచ్చారు. రూ.2 కోట్ల విలువైన స్థిరాస్తులను ఆయన విరాళంగా సమర్పించారు. నూజివీడు శివారులో 2200 చదరపు గజాల్లో ఉన్న సాయిబాబు లెండీవనం, దాంతో పాటు మూడు గదుల భవనాన్ని రాజధానికి విరాళంగా ఇచ్చేశారు. ఈ మేరకు అమరావతి పేర సిద్ధం చేసిన ఆస్తి పత్రాలను ఆర్డీవో చెరుకూరి రంగయ్యకు అందజేశారు. రాజధానిలో భాగస్వామ్యం కావాలన్న సీఎం చంద్రబాబు పిలుపు మేరకు తాను ముందుకు వచ్చినట్టు శివకుమార్ తెలిపారు.

  • Loading...

More Telugu News