: నా మొబైల్ ఫోనే నన్ను కాపాడింది: ఉగ్రదాడి బాధితుడి అనుభవం


ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరిగిన ఉగ్రదాడులు అక్కడి వారిలో భయంకరమైన అనుభవాలుగా మిగిలాయి. ఉగ్రదాడి బాధితుడు సిల్ వెస్త్రీ మాట్లాడుతూ, తన మొబైల్ ఫోన్ తనను రక్షించిందని తెలిపాడు. కాల్పులు జరుగుతున్నప్పుడు తాను జాతీయ మైదానం బయట ఉన్నానని, అప్పటికే రక్తసిక్తమైన ఆ ప్రదేశాన్ని ఫోన్ కెమెరా ద్వారా బంధించేందుకు ప్రయత్నిస్తుండగా, తన ఫోన్ స్క్రీన్ పగిలిపోయిందని అన్నాడు. తీరా చూసేసరికి బుల్లెట్ తన ఫోన్ కు తగిలిందని, ఫోనే లేకపోతే ఆ బుల్లెట్ నేరుగా తన నుదుటిలోకి దిగబడి ఉండేదని ఆ భయానక సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నాడు. వెంటనే అప్రమత్తమయ్యేంతలో మరో బుల్లెట్ తన కాలిలోకి దిగబడిందని, బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి తప్పించుకున్నానని సిల్ వెస్త్రీ తెలిపాడు. తన ఫోనే లేకుంటే తాను బతికి ఉండేవాడిని కాదని, తన ఫోనే తనను కాపాడిందని ఆయన అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News