: ప్యారిస్ పై దాడి, ముంబై అటాక్ రెండూ ఒకేలా ఉన్నాయ్: అమెరికా


ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ పై ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు జరిపిన దాడులు 2008లో ముంబైపై జరిగిన టెర్రరిస్ట్ అటాక్ మాదిరే ఉన్నాయని అమెరికా రక్షణ నిపుణులు స్పష్టం చేశారు. టెర్రరిస్ట్ దాడులపై పశ్చిమ దేశాల స్పందన ఎలా ఉంటుందో తెలుసుకునే క్రమంలో... ఇదొక గేమ్ ఛేంజర్ అయి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. ఈ రెండు దాడులు కూడా తక్కువ ఖర్చుతో, తక్కువ వనరులతో జరిగాయని... అంతేకాకుండా రెండు దాడులకు అనేక సారూప్యతలు కనబడుతున్నాయని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెందిన ఇంటెలిజెన్స్ అండ్ కౌంటర్ టెర్రరిజం డిప్యూటీ కమిషనర్ బ్రూస్ హాఫ్ మెన్ తెలిపారు. మరోవైపు డబ్ల్యుబీజెడ్ టీవీ సెక్యూరిటీ అనలిస్ట్ ఎడ్ డేవిస్ మాట్లాడుతూ, ఇది ముమ్మాటికీ ముంబై తరహా దాడేనని అన్నారు. ఒకటి కన్నా ఎక్కువ టీములు వివిధ ప్రాంతాల్లో దాడులకు పాల్పడటం ముంబై తరహా ఘటనేనని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News