: 'ప్రజా తెలంగాణ వేదిక' పేరుతో ఓ సంస్థ ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో 'ప్రజా తెలంగాణ వేదిక' పేరుతో ఓ సంస్థ ఏర్పాటైంది. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగిన శ్రీశైల్ రెడ్డి, కందిమళ్ల ప్రసాద్ లు ఈ సంస్థను ఏర్పాటు చేశారు. వచ్చే జూన్, జులైలో దీనిని 'ప్రజా తెలంగాణ' పేరుతో రాజకీయ పార్టీగా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మీడియా సమావేశంలో తెలిపారు. టీఆర్ఎస్ లో కుటుంబ పాలనను ఇప్పుడున్న పార్టీలేవీ గట్టిగా ప్రశ్నించలేకపోతున్నాయని, తమ పార్టీ వచ్చాక వారిని నిలదీస్తామని పేర్కొన్నారు.