: ఐదో వికెట్ కోల్పోయిన సఫారీలు... హాఫ్ సెంచరీ చేసిన ఏబీ
బెంగళూరు టెస్టులో సఫారీల బ్యాటింగ్ నెమ్మదించింది. 35 ఓవర్లలో ఐదు వికెట్లు చేజార్చుకున్న సఫారీలు టీమిండియా స్పిన్ కు దాదాపుగా చేతులెత్తేసినట్టే కనిపిస్తున్నారు. ఇప్పటిదాకా కుప్పకూలిన ఐదు వికెట్లలో రవిచంద్రన్ అశ్వన్ ఏకంగా మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకోగా, తొలి టెస్టులో చక్రం తిప్పిన రవీంద్ర జడేజా ఓ వికెట్ ను చేజిక్కించుకున్నాడు. ఇక ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ కూడా ఓ వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు వందో టెస్టు ఆడుతున్న సఫారీ స్టార్ బ్యాట్స్ మన్ ఏబీ డివిలియర్స్ (50) 59 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ లో రెండు వికెట్లు తీసిన అశ్విన్ 35 ఓవర్ లో సఫారీ జట్టు మరో కీలక బ్యాట్స్ మన్ జేపీ డుమిని (15)ని బోల్తా కొట్టించాడు. 37 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి పర్యాటక జట్టు 127 చేసింది. డుమిని నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన డేన్ విలాస్ (1) ఏబీకి జత కలిశాడు.