: ఈటీవీ నాలుగు కొత్త ఛానళ్లు ప్రారంభం


రామోజీ గ్రూపు నుంచి మరో నాలుగు సరికొత్త ఛానళ్లు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12.06 గంటలకు రామోజీరావు తన మనవరాలితో కలిసి ఈ ఛానళ్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. దీంతో, ఇప్పటికే ప్రేక్షకులను అమితంగా అలరిస్తున్న ఈటీవీ... ఈటీవీ ప్లస్, ఈటీవీ లైఫ్, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి ఛానళ్లతో తెలుగువారికి మరింత చేరువకాబోతోంది. ఈ సందర్భంగా, రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావు మాట్లాడుతూ, ఇప్పటి దాకా ఈనాడు సంస్థలను ఎంతో ఆదరించారని తెలుగువారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నాలుగు కొత్త ఛానళ్లను కూడా అదే రీతిలో ఆదరించి, అభిమానించాలని విన్నవించారు. అనుక్షణం నవ్వులు పంచేందుకు 'ఈటీవీ ప్లస్' ఛానల్ వచ్చిందని ఈ సందర్భంగా రామోజీరావు తెలిపారు. సరైన ఆరోగ్య సమాచారం, వ్యాధుల వివరాలు, పిల్లలు, మహిళల సమస్యలు, నిపుణుల సలహాలతో 'ఈటీవీ లైఫ్' వచ్చిందని చెప్పారు. ఆణిముత్యాల్లాంటి సినిమాలు, హుషారెత్తించే చిత్రాలతో 'ఈటీవీ సినిమా' అలరిస్తుందని అన్నారు. సరికొత్త వంటకాలు, చిటికెలో చేసే వంటలు, ప్రముఖ చెఫ్ లతో వంటకాలు మొదలైన అంశాలతో 'ఈటీవీ అభిరుచి' మీ ముందుకు వచ్చిందని తెలిపారు.

  • Loading...

More Telugu News