: ఫుట్ బాల్ మ్యాచ్ వీక్షణలో ఫ్రాన్స్ అధ్యక్షుడు... స్టేడియం బయట ఆత్మహుతి దాడి


ఫ్రాన్స్, జర్మనీ ఫుట్ బాల్ జట్ల మధ్య మ్యాచ్ అంటే విశ్వవ్యాప్తంగా ఆసక్తే. ఈ మ్యాచ్ కు సాధారణ క్రీడాభిమానుల నుంచి ఆయా దేశాల అధ్యక్షుల దాకా క్యూ కట్టడం మనం చూస్తున్నదే. నిన్న రాత్రి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడుల సమయంలోనూ ఆ నగరంలోని ఆ రెండు జట్ల మధ్య ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కు వేదికైన స్టేట్ డీ ఫ్రాన్స్ స్టేడియం జనంతో నిండిపోయింది. సాక్షాత్తు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ కూడా స్టేడియంలో కూర్చుని మ్యాచ్ ను కన్నార్పకుండా చూస్తున్నారు. ఇదే సమయంలో ఉన్నట్టుండి స్టేడియం బయట ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. స్టేడియానికి అతి సమీపంలో మూడు శక్తిమంతమైన పేలుళ్లు సంభవించాయి. ప్యారిస్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులు నగరంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ క్రమంలో స్టేడియం వద్దకు వచ్చిన ఓ ముష్కర ముఠా ఆత్మాహుతి దాడికి దిగింది. దీంతో స్టేడియంలో ఒక్కసారిగా అలజడి రేగింది. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది హోలాండ్ ను సురక్షిత ప్రాంతానికి తరలించి, జనాన్ని ఎమర్జెన్సీ గేట్ల ద్వారా బయటకు పంపే యత్నం చేశారు. ఈ సందర్బంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో పలువురికి గాయాలయ్యాయి. అధ్యక్షుడు ఉన్న చోటే ఆత్మాహుతి దాడి జరగడంతో భద్రతా దళాలు షాక్ కు గురయ్యాయి. వెనువెంటనే రంగంలోకి దిగి ఉగ్రవాదుల వేటకు ఉప్రకమించాయి.

  • Loading...

More Telugu News