: అంత్యక్రియలు జరుగుతుండగా ఆత్మాహుతి దాడి... బాగ్దాద్ లో 12 మంది మృతి


ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో షియా వర్గానికి చెందిన ఒక వ్యక్తి అంత్యక్రియలను నిర్వహిస్తుండగా నేడు దారుణం చోటుచేసుకుంది. అమిల్ ప్రాంతంలో ఈ కార్యక్రమం జరుగుతుండగా అక్కడ ఒక వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 12 మంది చనిపోగా, సుమారు 32 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా పూర్తిగా తెలియలేదని అధికారులు చెప్పారు. కాగా, ఈ దారుణ సంఘటనకు తామే కారణమంటూ ఇంతవరకూ ఎవరూ ప్రకటించలేదు.

  • Loading...

More Telugu News