: నకిలీ నెయ్యి దందా బట్టబయలు చేసిన విజయవాడ పోలీసులు
విజయవాడ పోలీసులు నకిలీ నెయ్యి దందాను బట్టబయలు చేశారు. దుర్గా నెయ్యి పేరిట జరుగుతున్న కల్తీని పోలీసులు పట్టుకున్నారు. భారతీనగర్ లో ఓ మామిడి తోటలో నాసిరకం డాల్డా, రైస్ బ్రాన్ ఆయిల్, పలు రకాల కెమికల్స్ కలిపి తయారుచేసిన వేల లీటర్ల నకిలీ నెయ్యిని పట్టుకున్నారు. విజయవాడ నుంచి ప్రతి రోజూ వేల లీటర్ల నకిలీ నెయ్యిని విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశాలకు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. అలాగే, దుర్గా బ్రాండ్ కు చెందిన పది వేల కవర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దందా సూత్రధారి ఆకుల ఫణి అని పోలీసులు చెప్పారు. ఈ దాడుల్లో నలుగుర్ని పట్టుకుని వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.