: దర్శకుడి ఫేస్ బుక్ వేట ఫలించింది... ఆ చిన్నారిని కలుసుకున్నాడు!


ప్రముఖ మలయాళ దర్శకుడు మేజర్ రవి ఫేస్ బుక్ వేట ఫలించింది. మేజర్ రవికి మాలీవుడ్ లో ఎంతో మంది అభిమానులున్నారు. ఆయన ఫేస్ బుక్ పేజ్ ను ఆయన అభిమానులు అనుసరిస్తుంటారు. ఓ అభిమాని షేర్ చేసిన ఓ పాప పాట ఆయనను అమితంగా ఆకట్టుకుంది. దీంతో ఆ పాపకు ఆయన అభిమానిగా మారారు. ఆ పాటను షేర్ చేస్తూ... ఈ పాప అడ్రెస్ తెలిస్తే చెప్పాలని ఫేస్ బుక్ లో వేట మొదలు పెట్టారు. ఈ పాప పాటకు 2 లక్షలకు పైగా లైకులు రాగా, 8 వేల మంది షేర్ చేసుకున్నారు. ఎట్టకేలకు ఓ అభిమాని ఆ చిన్నారి నివాస రహస్యం వెల్లడించాడు. కేరళలోని వైనాడ్ జిల్లాలో షహానా అనే చిన్నారి ఆ పాట పాడిందని తెలుసుకున్నాడు. అంతే, ఆ దర్శకుడు ఆ చిన్నారి స్కూలుకు వెళ్లి కలుసుకున్నాడు. పాపతో ఆ పాట మరోసారి పాడించుకుని సంబరపడిపోయాడు. కానుకలిచ్చి అభిమాన గాయనికి అభినందనలు తెలిపాడు. దీంతో ఆ చిన్నారి త్వరలో సినిమా నేపథ్యగాయనిగా మారనుందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఆమెకు ఆ ప్రతిభ ఉందని పలువురు ప్రశంసిస్తున్నారు.

  • Loading...

More Telugu News