: పవన్ సొంత ఖర్చులతోనే విజయవాడకు వచ్చారు: మంత్రి కామినేని
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఏపీ ప్రభుత్వమే ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకొచ్చిందంటూ వైఎస్ఆర్ సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను మంత్రి కామినేని శ్రీనివాస్ ఖండించారు. ప్రజా సమస్యలపై చంద్రబాబుకు వివరించేందుకు సొంత ఖర్చులతో ఆయనే విజయవాడకు వచ్చారని తెలిపారు. ప్రత్యేక విమానంలో పవన్ ను ప్రభుత్వం తీసుకువచ్చిందని వైసీపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై వైసీపీ నేతల కంటే మెరుగ్గా పవన్ పోరాడుతున్నారని ప్రశంసించారు. ఈసారి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హెచ్చరించారు.