: టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేత రాజారపు ప్రతాప్
టీఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీల నేతల చేరిక ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా కాంగ్రెస్ నేత రాజారపు ప్రతాప్ ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ వరంగల్ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుల సమక్షంలో రాజారపు చేరారు. ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన అనుచరులు పలువురు కూడా టీఆర్ఎస్ లో చేరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే బంగారు తెలంగాణ సాధ్యమని రాజారపు నమ్మారని, అందుకే ఆయన టీఆర్ఎస్ లో చేరారని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.