: కారెక్కి దర్జాగా సీట్లో కూర్చున్న ఒంటె!


ఒంటెకి ఒళ్లు మండి కారెక్కి దర్జాగా సీట్లో కూర్చుని కంగారు పెట్టింది. సౌదీ అరేబియాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... ఇద్దరు వ్యక్తులు సరదాగా డ్రైవ్ కి వెళ్లారు. ఇంతలో ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు కానీ ఓ ఒంటె అకస్మాత్తుగా రోడ్డు మీద ప్రత్యక్షమైంది. దీంతో వారు కారు స్లో చేశారు. దీంతో ఒంటెకు ఏమైందో తెలియదు కానీ, పూనకం వచ్చిన దానిలా కారుపైకి ఎక్కింది. కాలితో అద్దాన్ని ధ్వంసం చేసింది. టాప్ పైకి ఎక్కి దాన్ని ధ్వంసం చేసి సీట్లో కూలబడింది. ఈ ఘటనలో ఇంత విధ్వంసం సృష్టించిన ఒంటెకు ఏమీ కాకపోగా, కార్లో కూర్చున్న ఓ వ్యక్తికి అద్దం గుచ్చుకుని తీవ్ర రక్తస్రావమైంది. ఈ ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇది వైరల్ అయ్యింది.

  • Loading...

More Telugu News