: రాజయ్య కోడలు కేసులో సనాకు రిమాండ్


మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవళ్ల సజీవదహనం కేసులో ఏ4 నిందితురాలు సనాకు వరంగల్ జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆమెను కేంద్ర కారాగారానికి తరలించారు. రాజయ్య ఇంట్లో ఘటన జరిగినప్పటి నుంచీ ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. దాంతో హన్మకొండ పోలీసులు ప్రత్యేక బృందంతో గాలింపు చేపట్టి ఈ నెల 8వ తేదీన ఖమ్మం జిల్లాలో సనను అదుపులోకి తీసుకున్నారు. ఐదురోజుల పాటు వరంగల్ లోనే పలు పోలీస్ స్టేషన్లలో మీడియా కంట పడకుండా ఉంచి విచారించారు. ఇవాళ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాక కోర్టు ముందు ప్రవేశపెట్టడంతో న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఇప్పటికే రాజయ్య, భార్య మాధవి, కొడుకు అనిల్ లు వరంగల్ జైలులో రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News