: దమ్ముంటే ఆర్థిక మంత్రి బహిరంగ చర్చకు రావాలి: వైకాపా
కట్టుబట్టలతో అమరావతికి పంపించేశారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలను వైకాపా నేత పార్థసారథి తప్పుబట్టారు. కట్టుబట్టలతో వచ్చిన వారు ఆడంబరాల కోసం వందల కోట్లను ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. అబద్ధాలు చెబుతూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ము, ధైర్యం ఉంటే ప్రభుత్వ ఆదాయ వ్యయాలపై ఆర్థిక మంత్రి యనమల బహిరంగ చర్చకు రావాలని... ప్రజలకు వాస్తవాలను వివరించాలని డిమాండ్ చేశారు. విలువైన ప్రభుత్వ భూములను టీడీపీ నేతలకు అప్పజెబుతున్నారని మండిపడ్డారు.