: వెడ్డింగ్ రింగులు పోయి టాటూలు వచ్చేశాయ్!


ప్రతిదీ వెరైటీగా ఉండాలనే కోరుకునే యువత వారి వెడ్డింగ్ ఎంగేజ్ మెంట్ న్ కూడా వినూత్న పద్ధతిలో జరుపుకుంటోంది. పెళ్లికి ముందు జరిగే ఎంగేజ్ మెంట్ వేడుకల్లో కాబోయే దంపతులు పరస్పరం ఉంగరాలు మార్చుకోవడం పరిపాటి. ఇది మన సంప్రదాయమా? కాదా? అన్న విషయాన్ని పక్కనపెడితే... ఎంగేజ్ మెంట్ కార్యక్రమం కొత్త పుంతలు తొక్కుతోంది. ‘రింగ్’ స్థానంలో ‘టాటూ’ వచ్చి చేరింది. ఎంగేజ్ మెంట్ లో ఉంగరాలు మార్చుకోవడానికి బదులుగా రింగ్ మోడల్స్ లో టాటూ వేయించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ కొత్త సంస్కృతి మన దేశానికీ పాకింది. రింగ్ మోడల్ టాటూతో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఈ పద్ధతిలో ఎంగేజ్ మెంట్ చేసుకున్న వారు, చేసుకోవాలనుకుంటున్నవారు. మొదటిది... బంగారం కొనుగోలు నిమిత్తం చేసే ఖర్చు తప్పుతుంది. రెండోది... ఉంగరం పెట్టుకుంటే ఎప్పుడన్నా తీసెయ్యాలనిపిస్తుంది. కానీ, టాటూ రింగ్ తో అయితే ఆ సమస్య ఉండదని, అందుకే ఈ సరికొత్త పద్ధతి పాటిస్తున్నామని వారు అంటున్నారు.

  • Loading...

More Telugu News