: 'ఇన్ఫీ'లకు 'పే డే'... ఎదురుచూస్తున్న స్పెషల్ బోనస్, ప్రోత్సాహకాలు!
ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లో ఉద్యోగుల కోసం స్పెషల్ బోనస్ తో పాటు ప్రోత్సాహకాలు ఎదురుచూస్తున్నాయి. సంస్థలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులు, సేల్స్ ఎగ్జిక్యూటివ్ లకు వీటిని అందించనున్నట్టు సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావు వెల్లడించారు. వీరికి రెగ్యులర్ గా ఇచ్చే బోనస్ లతో పాటు ప్రత్యేక బోనస్ కూడా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సంస్థను నమ్ముకుని తమ నైపుణ్యంతో లాభాలను పెంచుతున్న వారికి ఏదైనా కొత్తగా ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కంపెనీ స్వల్పకాల లక్ష్యాలకు ఉద్యోగులు పునరంకితమయ్యేలా ఈ ఇన్సెంటివ్ లు ఉంటాయని అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20 వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను క్యాంపస్ రిక్రూట్ మెంట్ విధానంలో సంస్థలోకి ఆహ్వానించనున్నామని ప్రవీణ్ రావు తెలిపారు.