: మా అన్నయ్యను కలిసేందుకు అనుమతివ్వండి... కోర్టులో చోటా రాజన్ చెల్లెళ్ల పిటిషన్
ఇటీవల ఇండోనేషియా నుంచి ఢిల్లీకి తరలించిన అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ ను కలిసేందుకు అతని ఇద్దరు సోదరీమణులు కోర్టు అనుమతి కోరారు. ఈ మేరకు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో రాజన్ చెల్లెళ్లు సునీత సక్కారమ్ చవాన్, మాలిని సక్పాల్ లు పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే సీబీఐ కోర్టు ప్రత్యేక జడ్జి ఓపీ సైనీ ఆ పిటిషన్ ను విచారణకు పంపించారు. రేపు ఈ పిటిషన్ విచారణకు రానుంది.