: ఫిబ్రవరిలో యువీ, కీచ్ ల పెళ్లి!
భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. ఇప్పటికే బ్రిటన్ మోడల్, బాలీవుడ్ నటి హాజెల్ కీచ్ తో సగం పెళ్లి (ఎంగేజ్ మెంట్) చేసేసుకున్న యువీ, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆమెతో తన పెళ్లి తంతును ముగించనున్నాడు. యువీ, కీచ్ ల పెళ్లి ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దాదాపు మూడేళ్ల క్రితమే పరిచయమైన కీచ్ తో మూడు నెలలుగా యువీ డేటింగ్ చేస్తున్నాడు. వీరి మధ్య ఏదో జరుగుతోందని మీడియా ప్రచారం మరింత పెరగకముందే అందరినీ ఆశ్చర్యంలో మెంచెత్తుతూ యూవీ, కీచ్ లు బుధవారం ఇండోనేసియా నగరం బాలిలో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఇక ఫిబ్రవరిలో జరగనున్న పెళ్లి తంతుతో వీరిద్దరూ దంపతులు కానున్నారు.