: ఇండియాలో ఘోరాలపై మోదీని ప్రశ్నించండి: కామెరాన్ పై 46 మంది బ్రిటన్ ఎంపీల ఒత్తిడి


ఇండియాలో పెరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలపై ఆ దేశ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించాలని విపక్ష లేబర్ పార్టీ నేత జెర్మీ కార్బిన్ సహా 46 మంది బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు ప్రధాని డేవిడ్ కామెరాన్ పై ఒత్తిడి తెచ్చారు. "ఇండియాతో ప్రత్యేక సంబంధాలు ఉన్నాయని చెప్పుకునే బ్రిటన్ ప్రధాని, భారత ప్రధానితో అక్కడ జరుగుతున్న ఘోరాలపై ఎందుకు మాట్లాడకూడదు? మన అనుమానాలను నివృత్తి చేసుకోవాలి" అంటూ పార్లమెంటులో ఓ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. గ్రీన్ పీస్ కార్యకలాపాలపై, ఆ సంస్థ కార్యకర్త ప్రియా పిళ్లైపై మోదీ సర్కారు నిషేధాన్ని విధించిందని, దీన్ని కూడా పరిశీలించాలని తీర్మానంలో కోరారు. నిన్న బ్రిటన్ పార్లమెంటును ఉద్దేశించి మోదీ ప్రసంగించిన సమయంలో కార్బిన్ రాయల్ గ్యాలరీలో లేరు. శనివారం నాడు మోదీ పర్యటన ముగిసేలోగా మోదీతో ఆయన భేటీ జరగనుంది. ఈ సమావేశంలో తన మనసులోని అంశాలను మోదీ ముందుంచాలన్నది ఆయన అభిమతంగా తెలుస్తోంది. కాగా, ఈ తీర్మానంపై సంతకాలు పెట్టిన వారిలో జాన్ మెక్ కొన్నెల్, అలెక్స్ సాల్మండ్ తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News