: చెన్నైలో భారీ వర్షం... ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు... విద్యాసంస్థలకు సెలవు
గత నాలుగైదు రోజుల నుంచి తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నైలో సైతం ఈరోజు భారీ వర్షం కురిసింది. దాంతో నగరంలోని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా చెన్నై-సూళ్లూరుపేట మధ్య లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాంతో చెన్నై నుంచి నెల్లూరుకు వెళ్లాల్సిన లోకల్ రైళ్లను రద్దు చేసినట్టు సూళ్లూరుపేట స్టేషన్ మేనేజర్ తెలిపారు. మరోవైపు ఎక్స్ ప్రెస్ రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. భారీ వర్షాలకు తమిళనాడు వ్యాప్తంగా రోడ్లు దెబ్బతినడంతో రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.