: ఉదయం కామెరూన్ తో కలిసి మోదీ యోగా!...మధ్యాహ్నం బ్రిటన్ రాణి విందుకు హాజరు


బ్రిటన్ ప్రధాని జేమ్స్ కామెరూన్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ యోగాసనాలు వేయించనున్నారు. బ్రిటన్ పర్యటనకు వెళ్లిన మోదీ నిన్న రాత్రి బ్రిటన్ ప్రధాని గెస్ట్ హౌస్ ‘చెకర్స్ భవనం’లో బస చేశారు. ఇక్కడ బస చేసిన తొలి భారత ప్రధాని మోదీనేనట. ఈ భవనంలోనే 1971లో నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్ ల మధ్య చర్చలు జరిగాయి. నేటి ఉదయం ఈ భవనంలో కామెరూన్ తో కలిసి మోదీ యోగా చేయనున్నారు. ఇక మధ్యాహ్నం బ్రిటన్ రాజ ప్రాసాదం బకింగ్ హాం ప్యాలెస్ కు మోదీ వెళ్లనున్నారు. అక్కడ బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 తన గౌరవార్థం ఇస్తున్న విందుకు హాజరవుతారు. అంతకుముందు బ్రిటన్ లోని ప్రముఖ కంపెనీల సీఈఓలతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో మోదీ పాలుపంచుకుంటారు. బ్రిటన్ రాణి విందు అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొనే మోదీ, బ్రిటన్ నగరం సొలిహాల్ లోని టాటా మోటార్స్ కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఫ్యాక్టరీని సందర్శిస్తారు.

  • Loading...

More Telugu News