: అమరావతి నిర్మాణంలో బ్రిటన్ భాగస్వామ్యం... మోదీ, కామెరూన్ ల సంయుక్త ప్రకటన
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి మరింత మద్దతు లభించింది. ఇప్పటికే సింగపూర్, జపాన్ దేశాలు ఈ నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాయి. తాజాగా మరో అగ్ర దేశం బ్రిటన్ కూడా ఈ నిర్మాణంలో భాగస్వామి కానుంది. ఈ మేరకు బ్రిటన్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఆ దేశ ప్రధాని జేమ్స్ కామెరూన్ చేసిన సంయుక్త ప్రకటనలో ఈ అంశానికి చోటు దక్కింది. అమరావతితో పాటు మహారాష్ట్రలోని పుణే, మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరాల అభివృద్ధికి భారత్, బ్రిటన్ లు సంయుక్తంగా కృషి చేయనున్నట్లు ఇరువురు ప్రధానులు ప్రకటించారు. భారత ప్రభుత్వం చేపట్టిన పట్టణాభివృద్ధి లక్ష్యాలకు బ్రిటన్ సహకరిస్తుందని సదరు సంయుక్త ప్రకటన వెల్లడించింది.