: నేను డాలర్లు సంపాదిస్తే టీఆర్ఎస్ కు కళ్లు మంటా?: వరంగల్ బీజేపీ అభ్యర్థి దేవయ్య
తాను విదేశాల్లో డాలర్లు సంపాదించడం టీఆర్ఎస్ నేతలకు కంటగింపుగా మారిందని వరంగల్ బీజేపీ అభ్యర్థి దేవయ్య ఆరోపించారు. వరంగల్ లో ఆయన మాట్లాడుతూ, ఎన్ఆర్ఐ దేవయ్యకు వరంగల్ లో పోటీ చేసే అర్హత లేదని చెబుతున్నారని, తనకు ఉన్న అర్హత ఏంటంటే...తాను ఎస్సీ హాస్టల్ లో చదువుకుని పెద్దవాడినయ్యానని చెప్పారు. హార్వార్డ్ యూనివర్సిటీలో పిడియాట్రిషన్ విభాగంలో అత్యున్నత విద్యనభ్యసించానని అన్నారు. అమెరికాలో ఫాస్టెస్ట్ సెవెన్త్ గ్రోయింగ్ కంపెనీని ప్రారంభించానని ఆయన తెలిపారు. గతంలో టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ, ఎంపీ కావాలంటే పార్లమెంటులో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడేవాడు కావాలని అన్నారని, ఇప్పుడు ఎన్ఆర్ఐ అంటున్నారని మండిపడ్డారు. తాను డాలర్లు సంపాదించకూడదా? అని దేవయ్య ప్రశ్నించారు. తనకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలు వచ్చని, కావాలంటే టీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టి పరీక్షించుకోవచ్చని ఆయన వెల్లడించారు.