: ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అలా వుండాలి!
ఈ మధ్యకాలంలో పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి 'ఫ్రెండ్లీ పోలీసింగ్ ను అమలు చేస్తున్నాం' అని చెప్పడం వింటుంటాం...అసలు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏమిటి అనడానికి ఉదాహరణగా ఓ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఇంగ్లండ్ లోని మిడిల్టన్ ప్రాంతంలో ఫ్రెడ్, డోరిస్ థమ్సన్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 95 ఏళ్లకు పైగా వయసు ఉంటుంది. డోరిస్ థమ్సన్ కు ఈ మధ్యే చూపు మందగించింది. దీంతో ఫ్రెడ్ కు భర్తతోనే సరిపోతోంది. ఆమె కూడా బయటకు వెళ్లడం లేదు. ఈ నేపథ్యంలో ఎవరైనా తోడు ఉంటే బాగుంటుందనిపించిన ఆ వృద్ధ దంపతులు ఏ బాంధవ్యం లేని ఎమర్జెన్సీ నెంబర్ కు కాల్ చేశారు. వయసైపోయిందని, తమకు ఎవరూ తోడు లేరని, ఒంటరిగా ఉన్నామని, వచ్చి ఓ టీతాగి వెళ్లండని పోలీసులను ఆహ్వానించారు. పనుల ఒత్తిడిలో ఉండే పోలీసులు ముందు ఆశ్చర్యపోయినా, పెద్దలను గౌరవించే స్టూ అక్ వెల్ అనే పోలీసు వారింటికి వెళ్లాడు. అంతేకాదు, వృద్ధ దంపతులకు స్వయంగా టీ చేసి ఇచ్చాడు. వారితో కొంత సమయం గడిపి వెళ్లాడు. తమ అభ్యర్థన మన్నించి టీ తాగేందుకు వచ్చిన పోలీసుకు థామ్సన్ దంపతులు కృతజ్ఞతలు తెలుపగా, ఆతిథ్యానికి పిలిచి రెండో ప్రపంచ యుద్ధం నాటి ఘటనలు ఎన్నో చెప్పి, మధురానుభూతులు నింపిన ఆ దంపతులకు ధన్యవాదాలు తెలిపాడు స్టూ. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనేమో...కదూ?