: జైపాల్ రెడ్డి చరిత్ర అందరికీ తెలుసు: కర్నె ప్రభాకర్


కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. గతంలో తెలంగాణ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణలకు టీఆర్ఎస్ ను విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి రాజయ్యను తొలగించి... దళితులను ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా అవమానించారని జైపాల్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో, కర్నె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కూడా కర్నె విమర్శలు గుప్పించారు. ఆయన చేసిన అవినీతినే మిగతా వాళ్లు కూడా చేస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన చరిత్ర అందరికీ తెలుసని అన్నారు.

  • Loading...

More Telugu News