: డ్రై స్కిన్ ఉన్న వాళ్లు ఈ టిప్స్ పాటిస్తే చాలు...!
మనలో చాలా మందిని డ్రై స్కిన్ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ముఖం, పెదవులు, చేతులు కొన్ని కారణాల వల్ల చాలా తేలికగా డీహైడ్రేట్ అవుతుంటాయి. దీంతో, చర్మం పొడిబారిపోతుంది. ఈ కారణం వల్ల చర్మం కాంతిని కోల్పోవడమే కాక, వయసు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని టిప్స్ పాటిస్తే డ్రై స్కిన్ సమస్య నుంచి బయటపడవచ్చు. * ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి: నీరు, జ్యూసులు, టీ వంటివి తీసుకోవాలి. దీంతో, చర్మానికి సాగే గుణం వస్తుంది. యంగ్ లుక్ సొంతమవుతుంది. * పండ్లు తీసుకోవాలి: ప్రతి రోజు వివిధ పండ్లను తీసుకోవాలి. ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం సిట్రస్ పళ్లు (నిమ్మ, ఆరెంజ్, మొదలైనవి), కివీస్ తో కలుపుకుని తీసుకుంటే చాలా మంచింది. * డే క్రీమ్: చర్మం ఎరుపెక్కడం లేదా డ్రై స్కిన్ వల్ల వచ్చే దురదను కంట్రోల్ చేయాలంటే మంచి క్వాలిటీ డే క్రీమ్ ను వాడాలి. * నైట్ క్రీమ్ వాడటం మరువరాదు: ప్రధానంగా శీతాకాలంలో నైట్ క్రీమ్ వాడటం మరువరాదు. మాయిశ్చరైజర్ వాడినా ఓకే. ఇది చర్మం ముడతలు పడకుండా రక్షిస్తుంది. * హైడ్రేటింగ్ మాస్కులు: చర్మాన్ని సున్నితంగా ఉంచుకోవడానికి, పొడిబారకుండా కాపాడుకోవడానికి హైడ్రేటింగ్ మాస్కులు ఉపయోగపడతాయి. పడుకోవడానికి ముందు 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ మాస్క్ వేసుకుంటే మంచిది. * చేతుల గురించి మరువకండి: ప్రతి రోజు మనం ఎన్నోసార్లు చేతులు కడుక్కుంటూ ఉంటాం. దీంతో చర్మం ఇరిటేటింగ్ గా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో గ్లిజరిన్ లేదా షియా బటర్, కోకో, తేనె, ఆల్మండ్ ఆయిల్ లేదా బోరేజ్ ఆయిల్ ఉన్న హ్యాండ్ క్రీములను రాసుకోవాలి. * పెదవుల కోసం: గాలి, చలి, గాలిలో తేమ వల్ల మన పెదవులు డ్రై అయిపోతాయి. దీంతో, పెదవులు పగలడం, కొన్ని సందర్భాల్లో రక్తం రావడం కూడా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీస్ వ్యాక్స్, జొజోబా ఆయిల్, షియా బటర్ లేదా ఆలివ్ ఆయిల్ కలిగి ఉన్న లిప్ బామ్ లను అప్లై చేసుకోవాలి. లిప్ స్టిక్ వేసుకునే వారు కూడా మొదట లిప్ బామ్ పూసి ఆ తర్వాత లిప్ స్టిక్ వేసుకోవాలి.