: భవిష్యత్తుపై ఓ క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్


జనసేన విస్తరణపై ఆ పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ అసక్తత వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, పార్టీని విస్తరించాలని ఉందని, అయితే అందుకు సరిపడా నిధులు తన వద్ద లేవని తెలిపారు. ఆర్థిక స్తోమత లేని కారణంగానే పార్టీని నెమ్మదిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సన్నిహితులతో మాట్లాడి పార్టీని విస్తరించేందుకు గల అవకాశాలను పరిశీలిస్తానని పవన్ చెప్పారు. 2019 ఎన్నికల నాటికి పార్టీని విస్తరించి, ఎన్నికల్లో పోటీ చేసే దిశగా ఆలోచిస్తామని భవిష్యత్ పై ఓ స్పష్టతనిచ్చారు. అయితే, 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీ రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందా? లేక కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితమవుతుందా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. కాగా, పవన్ తాజా వ్యాఖ్యలతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే ఆలోచన కనబడడం లేదని విశ్లేషణలు వినపడుతున్నాయి.

  • Loading...

More Telugu News