: మోదీ, అమిత్ షాలపై బీజేపీ ఎంపీ ధిక్కారస్వరం
ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలపై బీహార్ బీజేపీ ఎంపీ భోలా సింగ్ విరుచుకుపడ్డారు. ఇద్దరి వ్యవహారశైలి పార్టీని నాశనం చేస్తోందని మండిపడ్డారు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ పరాభవం చెందడానికి వీరే కారణమని ఆరోపించారు. అన్ని నిర్ణయాలు వీరిద్దరే తీసుకున్నారని, ఇప్పుడు ఓటమికి కూడా వీరిద్దరే బాధ్యత వహించాలని అన్నారు. అవసరమైతే అమిత్ షా తన పదవి నుంచి తప్పుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము ఇచ్చిన పవర్ తోనే మోదీ, అమిత్ షాలు ఉన్నత స్థానంలో కొనసాగుతున్నారని చెప్పారు. బీజీపీ పార్టీ మొత్తానికి కేన్సర్ వ్యాపించిందని... తక్షణమే ఆ మహమ్మారిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని భోలా సింగ్ అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, అతని కుమార్తెను కామెంట్ చేయడం, నితీష్ డీఎన్ఏ గురించి ఎద్దేవా చేయడం లాంటి చర్యలతో మోదీ పెద్ద తప్పిదం చేశారని భోలా సింగ్ అన్నారు. అదేవిధంగా అమిత్ షా చేసిన పాకిస్థాన్ కామెంట్లు కూడా బీజేపీపై ప్రతికూల ఫలితాలు వచ్చేలా చేశాయని అన్నారు.