: ట్రాఫిక్ పోలీసులు, 'జబర్దస్త్' అభి మధ్య వాగ్వాదం
ఈటీవీలో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కార్యక్రమంతో పేరు తెచ్చుకున్న అభి, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఈ ఉదయం నగర పరిధిలోని సుచిత్ర క్రాస్ రోడ్డులో ఓ మెడికల్ షాపు ముందు అభి తన కారును పార్క్ చేసి మందులు కొనేందుకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ట్రాఫిక్ పోలీసులు, అది 'నో పార్కింగ్ జోన్'గా చెబుతూ, టైర్లకు లాక్ వేశారు. 'నో పార్కింగ్ జోన్'ను సూచించేలా ఎటువంటి బోర్డూ అక్కడ లేదని, అప్పుడు తన కారుకు ఎలా లాక్ వేస్తారని అభి పోలీసులతో వాదించాడని తెలుస్తోంది. కారును అలా నడిరోడ్డుపై ఆపడం నిబంధనలకు విరుద్ధమని చెబుతూ, ఫైన్ విధించిన ట్రాఫిక్ పోలీసులు, తదుపరి కారును వెళ్లనిచ్చారట.