: స్టేజ్ పై లండన్ విద్యార్థుల 'అసభ్య' ప్రదర్శన!
వందలాది మంది చప్పట్లు, కేరింతలతో ఉత్సాహ పరుస్తుంటే, లండన్ లోని యూనివర్శిటీ ఆఫ్ హుల్స్ నైట్ క్లబ్ విద్యార్థినీ, విద్యార్థుల స్టేజ్ ప్రదర్శన బ్రిటన్ సంస్కృతి, సంప్రదాయాలకు షాకిచ్చింది. మెయిల్ ఆన్ లైన్ కథనం ప్రకారం, క్రొయేషియాకు మద్దతుగా జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులు 'శృంగార భంగిమ'లను బహిరంగ వేదికపై ప్రదర్శించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. వీరంతా నిర్వాహకులు ఉచితంగా ఇచ్చిన మద్యం తాగి స్టేజీపై అసభ్య భంగిమలతో రెచ్చిపోయారని, కొందరు తమ వంటిపైని ఒక్కో దుస్తులను తొలగించారని, వీరిని చూస్తున్న వీక్షకులు మద్దతు పలకడం సిగ్గు చేటని పలువురు విమర్శిస్తున్నారు. ఈ ప్రదర్శన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతుండగా, సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఈ స్టేజ్ షో చిత్రాలు జోరుగా తిరుగుతున్నాయి.