: రాజకీయాలపై ఆసక్తి పోయిందంటూ, ఆమ్ ఆద్మీ పార్టీని వీడిన మరో సీనియర్ నేత
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మరో సీనియర్ నేత రాజీనామా చేశారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న మయాంక్ గాంధీ తన పదవిని వీడుతున్నట్టు ప్రకటించారు. తనకు రాజకీయాలపై ఆసక్తి పోయిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ మేరకు తన బ్లాగ్ లో ఓ బహిరంగ లేఖను ఉంచిన మయాంక్, "అరవింద్ అండ్ మై అదర్ ఫ్రెండ్స్" అంటూ, కొంతకాలంగా రాజకీయాలంటే అయిష్టత ఏర్పడిందని చెప్పారు. ఎవరిపైనా విమర్శలు చేయకుండానే, కేజ్రీవాల్ పై దేశం ఎన్నో ఆశలు పెంచుకున్నదని, జనవరి 2011 నుంచి ఆప్ లో పనిచేయడం తనకెంతో అనుభవాన్ని ఇచ్చిందని, భారత్ ను మార్చడంలో భవిష్యత్తులోనూ ఆప్ తనవంతు కృషి చేస్తుందనే భావిస్తున్నానని ఆయన అభిప్రాయపడ్డారు.