: టీడీపీ నేత అనుమానాస్పద మృతి
గుంటూరు జిల్లా టీడీపీ నేత కొసనా మధుసూదన్ (40) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచ్ ల సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. చేబ్రోలులో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఈ ఉదయం ఆయన గుంటూరు చేరుకున్నారు. అనంతరం అక్కడ నుంచి చేబ్రోలు బయలుదేరిన ఆయన కాకుమాను మండలం బుడంపాడు వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తొలుత దీన్ని రోడ్డు ప్రమాదంగా భావించారు. అయితే, ఘటన జరిగిన తీరుపై ఆయన బంధువులు అనుమానాలను వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.