: చంద్రబాబును కలసిన గురజాడ కుటుంబ సభ్యులు... శత వర్ధంతి ఉత్సవాలకు ఆహ్వానం


ప్రముఖ కవి గురజాడ అప్పారావు కుటుంబ సభ్యులు ఈరోజు విజయవాడ క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. విజయనగరంలో గురజాడ ఇంటిని ఇటీవల ఏపీ ప్రభుత్వం స్మారకచిహ్నంగా మార్చింది. ఈ నేపథ్యంలో సీఎంకు వారు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఆ ఇంటి పక్కన ఉన్న స్థలంలోనే ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతించాలని గురజాడ కుటుంబ సభ్యులు చంద్రబాబును కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. అంతేగాక ఈ సంవత్సరం నిర్వహించనున్న గురజాడ శత వర్ధంతి ఉత్సవాలకు రావాలని సీఎంను వారు ఈ సందర్భంగా ఆహ్వానించారు.

  • Loading...

More Telugu News